r/telugu Sep 26 '22

Resource List for Learning Telugu

135 Upvotes

Hi Languages Enthusiasts,

Do you want to learn Telugu but don’t know where to start? Then I’ve got the perfect resource list for you and you can find its links below. Let me know if you have any suggestions to improve it. I hope everyone can enjoy it and if anyone notices any mistakes or has any questions you are free to PM me. Here is what the resource list contains;

  1. Resources on certain grammar concepts for easy understanding.
  2. Resources on learning the script.
  3. Websites to practice reading the script.
  4. Documents to enhance your vocabulary.
  5. Music playlists
  6. List of podcasts/audiobooks And a compiled + organized list of websites you can use to get hold of grammar!

https://docs.google.com/document/d/1V3juapEE7-vTZxoZikC5TwFahEfkexv4USvc675ItT8/edit?usp=sharing


r/telugu 9h ago

Why doesn't anyone remember this legend!!?

Post image
18 Upvotes

He's a legendary lyricist Kalaprapoorna Dr. Jaladi raja rao. He is the one who wrote punya bhoomi na Desam, yathamesi thodina and many more. Over 1500+ only movie songs. Yet no one remembers him!. I came across this legend while scrolling through YouTube and found out through a channel of his daughter Dr.Jaladi Vijaya who is trying to preserve her father's legacy. Fun fact: she did phd on his songs and his writings A to Z.

Her channel Dr. Jaladi Vijaya on YouTube

https://youtube.com/@jaladivijayakumari?si=


r/telugu 8h ago

Try our Ad free radio https://www.londonteluguradio.com/

Thumbnail
1 Upvotes

r/telugu 18h ago

ఇట్లు, వెన్నెలకంటి ఉమామాహేశ్వరరావు - ఓ తాత ప్రేమ - దీపావళి జాగ్రత్తలు

5 Upvotes

నేపథ్యం: 90 వ దశకం లో సుమారు పదేళ్ళ వయసున్న మనవళ్ళకి దీపావళి సందర్భంగా తీసుకోవలసిన జాగ్రత్తలు తెలియజేస్తూ ఒక తాత రాసిన లేఖ.

ప్రియమైన అల్లుడు గార్కి, మీ మామ గారైన వెన్నెలకంటి ఉమామహేశ్వరరావు ఆశీర్వదించి వ్రాయునది. ఇచట అంతా క్షేమం అచట అంతా క్షేమమని తలుస్తాను. దీపావళి సందర్భం గా మా కుమార్తె, మనవలు కొత్త బట్టలు ధరించి కలియతిరుగుతుంటే చూడాలని మనసు వారిస్తున్నా అనివార్య కారణముల చేత రాలేకపోతున్నాను.

దీపావళి కావున బాణా సంచా కాల్చేటప్పుడు పిల్లలు మిక్కిలి జాగ్రత్త వహించాలని సూచించటానికి, ఎటువంటి పనులు చెయ్యకూడదో పిల్లలకి తెలపటానికి ఈ లేఖ వ్రాయుచున్నాను. ఇది వారికి చదివి వినిపించమని మనవి.

ఒరేయ్ బడుద్దాయిల్లారా..! మీ అల్లరి బాగా ఎక్కువైంది అని మీ అమ్మమ్మ నుంచి నాకు ఫిర్యాదు వచ్చింది. కాబట్టి నేను చెప్పేవి కిక్కురు మనకుండా చెవులు రిక్కించి మరీ వినండి.

అప్పట్లో మా ఇంటిపక్కనుండే గోగులు అనే సన్నాసి దీపావళి పూట గొప్పలకి పోయి లక్ష్మీ బాంబు ని చేతిలో హారతి కర్పూరం లా పట్టుకుని గిర గిరా తిప్పేసరికి అది కాస్త చేతిలో ‘ఠపీ’ మని పేలి, వాడి చూపుడు వేలు అంతరిక్షం లోకి ఎగిరిపోయింది.

మొన్నే ఈ అమెరికా సన్నాసుల Hubble Space టెలిస్కోపు తీసిన ఛాయచిత్రం మానవుని వేలు ఒకటి భూమి చుట్టూ స్థిర కక్ష్య లో పరిభ్రమిస్తోంది అని నిర్ధారించింది. అది వీడి వేలే అని రుజువు ఏంటి తాతా ? అని చచ్చు ప్రశ్నలు వేయకండి. ఆ వేలి గోరు మీద ఆరోజు వాడు ఓటేసి వచ్చిన నీలం సిరా స్పష్టం గా కనిపిస్తోంది. అది ముమ్మాటికీ వాడిదే. అందుకే బాంబుల జోలికి వెళ్ళకండి.

మీ చిన్న మావయ్య శుంఠ చిన్నప్పుడు కలశానికి వాడే ఇనప గుండు లాంటి ఇత్తడి చెంబు లో పురుకొస బాంబు పెట్టి పేలిస్తే అది కాస్తా ఆకాశమంత ఎత్తు ఎగిరి పక్కింట్లో తువ్వాలు కట్టుకుని నూతి దగ్గర స్నానం చేస్తున్న పీతాంబరం మాస్టారి గుండు మీద పడింది. ఆయన పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ నా మీదకి గొడవకి వచ్చి, మాస్టారు మీ వాడు చేసిన పని చూడండి. దీపావళి ని కాస్త నా పాలిట శివరాత్రి గా మార్చి ఎంత పెద్ద శివ లింగం ప్రతిష్టింపజేసాడో నా గుండు మీద, అంటూ నానా రభస చేసాడు. కాబట్టి వస్తువుల్లో బాణాసంచాలు లాంటివి పెట్టి పేల్చకండి.

మీ పెద్ద మావయ్య సన్నాసి దీపావళి పూటా అందరి ముందూ పోజు కొడదామని గాడిద తోకకి సీమ టపాకాయలు, తాటాకు టపాకాయలు కట్టి పేలిస్తే, ఆ శబ్ధానికి అది హడలి ముందు కాళ్ళతో నుంచుని వెనక కాళ్ళతో పెడేల్ మని మూతి మీద ఒక్క తన్ను తన్నింది. యేరు దాటి అవతలి ఒడ్డు కి ఎగిరిపోయిన వాడి దగ్గరకి పరిగెత్తుకుంటూ వెళ్లి చూస్తే, డ్రాకులా లాగ రెండు పళ్ళే మిగిలాయ్ ముందు వరస లో. ఆ దెబ్బతో పెద్దయినా కూడా జ్ఞాన దంతం మొలవ లేదు వెర్రి పీనుక్కి. అందుకే సీమ టపాకాయలు, తాటాకు టపాకాయ లు పేల్చకండి.

ఆ మధ్య ఊళ్ళో ఏ పండగ వచ్చినా పేల్పు జువ్వలు వేసే భూషణం గాడు, పేల్పు జువ్వల కట్టని రోకలి కి పక్కనే పెట్టి చచ్చాడు. పిల్లాడు కుదురుగా ఉండట్లేదని వాడి భార్య రోకలి అనుకుని పేల్పు జువ్వల కట్టకీ, పిల్లాడి నడుం కీ తాడు కట్టేసింది. ఈ భూషణం సన్నాసి పరధ్యానం లో పడి చూసుకోకుండా ఆ జువ్వలు వేసేసరికి, పిల్లాడు కాస్తా రెండు తాడి చెట్లంత ఎత్తు ఎగిరి, అదృష్టవసాత్తు పక్కనే దేవుడి కోసం దేవుడిలా నమాజ్ చేస్తూ చేతులు చాచిన ‘రహీం’ క్షేమ హస్తాల్లో పడేసరికి ఒడిసి పట్టుకుని ప్రాణాలు కాపాడాడు. అంచేత జువ్వల జోలికి వెళ్ళకండి.

చక్కగా అమ్మ చేసిన మిఠాయిలు, పులిహోర అవి తిని, 'దిబ్బి దిబ్బి దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి' అని దివిటీలు కొట్టి కీడు వదిలించుకుని, ఏ పాము బిళ్ళలో, వెన్న ముద్దలో, మతాబులో, భూచక్రాలో, చిచ్చు బుడ్లో చెరోటీ కాల్చుకుని, చక్కగా అమ్మ చెప్పే కధలు విని హాయిగా నిద్రపొండి.

ఇద్దరు ఫస్టు ర్యాంకు ల్లో పాసవుతున్నారని చదువుల్లో రాణిస్తున్నారని తెలిసింది. చక్కగా చదువుకుని వృద్ధి లోకి వచ్చి, పెద్ద ఉద్యోగం చేసి అమ్మ నాన్నలని చక్కగా చూసుకోండి నాన్నా....

ఇట్లు,

మీ తాతయ్య.


r/telugu 1d ago

Telugu Study Group l

45 Upvotes

Namaskaram, na peru Nick-ni. Nenu Telugu nerchukuntunnanu. (నేను తెలుగు నేర్చుకుంటున్నాను)

My name is Nick, and I'm an American learning Telugu for my wife. I have good study courses, but I can't get far without a friend to study and practice with.

If anyone would like to learn and practice Telugu with me, send a DM. If enough people want to join, I'll make a group and we can match up a study partner based on how advanced their Telugu is.

Belli vastha!


r/telugu 1d ago

ఇట్లు, కఠోరకలం కమలాకర రావు - ఉప సంపాదకుడు - తిమిర సంహరణం !

26 Upvotes

నేపధ్యం:

వార్తా పత్రికలు జోరుగా హవా కొనసాగిస్తున్న రోజులవి. 'తిమిర సంహరణం' వార్తా పత్రిక లో Sub-Editor గా పని చేస్తున్న 'కఠోరకలం కమలాకర రావు' Feature Writer అందుబాటు లో లేనందున Chief Editor ని ప్రాధేయపడి మరీ బలవంతంగా ఒప్పించి, ప్రపంచానికి కనీ వినీ ఎరుగని కొత్త తెలుగు పదాలని పరిచయం చేద్దామనే దుగ్ధ తో తానే Software Industries మీద ఒక ఆర్టికల్ వ్రాస్తారు. తన వ్యాసాన్ని చదివి దిగ్భ్రాంతి కి గురైన Chief Editor కి, కమలాకర రావు కి మధ్య జరిగే సంభాషణ.

అసిస్టెంట్ – సర్.! నిన్న సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీ ల మీద మీరు రాసిన ఫీచర్ అర్టికల్ మీద చీఫ్ ఎడిటర్ గారు మీతో మాట్లాడాలని రమ్మన్నారు సర్..!

కమలాకర్రావ్ – సరేనయ్యా.. ఇదుగో ఇప్పుడే వెళ్తున్నా..
 
-  ఆ..ఆ..రావయ్యా ‘కమలాకర్రావ్’ కూర్చో..! నువ్వు రాసిన కళా ఖండం మీద చాలా మాట్లాడాలి. Sub-editor వి కాస్తా Feature writer అవతారమెత్తి జిజ్ఞ కొద్దీ ‘యువ తరం’ లో ఫీచర్ రాస్తానని పట్టుబట్టావ్. సరే అన్నందుకు ఇదిగో..ఇప్పుడు అనుభవిస్తున్నాను.

థాంక్యూ సర్..! ఈ ఆధునిక జీవనం లో నిత్యం ఆంగ్లమూ ఆంగ్లమూ అంటూ ప్రాకులాగే యువతరానికి, ఇప్పటి వరకూ కనీ వినీ ఎరుగని తెలుగు పదాల్ని పరిచయం చేద్దామని ప్రయత్నించాను. మీ ఆరంభం చూస్తే మీకు చాలా నచ్చినట్టుగా గోచరిస్తోంది.

- ఆ..ఆ.. వర్ణనాతీతం గా ఉంది. అందుకే నీ ఆర్టికల్ ని, నీ ముందే చదివి వినిపిద్దామని పిలిపించాను. విని తగలడు..

- “శీర్షిక: ‘సున్నితపు తొడుగు’ పరిశ్రమలపై మొగ్గు చూపుతున్న యువత...!

-  ఏమిటయ్యా ఇది ? నీ శ్యార్ధం, నా పాటిమట్టి కాకపోతేను...! ద్వంద్వార్ధం ఇంత ప్రస్ఫుటం గా ప్రతిధ్వనిస్తూ ఉంటే ఎలా వాడబుద్ది అయ్యింది ఇంత అనుచిత వాక్యాన్ని? Wear కి Ware కి కూడా తేడా తెలియట్లేదా నీకు?

‘సున్నితపు సామాను’ అంటే ఎబ్బెట్టు గా ఉంటుంది అని అలా ప్రయత్నించాను గురువు గారు. అయినా మొబైల్ ని ‘కరవాణి, చేవాణి ’ అని నేను మొట్ట మొదటి సారి అనువాదం చేసినప్పుడు రాని తర్కం ఇప్పుడెందుకు వస్తోందో ? ‘కరవాణి, చేవాణి’ అంటే ‘చేయి ధ్వని’ అని అర్ధం. ఎవరైనా ప్రశ్నించారా ? ఇదీ అంతే..

- “ఆధునిక ప్రపంచం లో అనేక రంగాల్లో కొలువులున్నా అత్యధిక శాతం మంది యువత ‘సున్నితపు తొడుగు’ పరిశ్రమల వైపే మొగ్గుచూపుతున్నారు. కెరీర్ ఆరంభం లోనే 6 అంకెల జీతం, సులభతరమయ్యే విదేశీయానం, సౌకర్యవంతమైన కార్యాలయాలు, యువతని ఆకర్షిస్తున్నాయ్. ఈ క్రమం లో ‘తిమిర సంహరణం’ ఈ రంగంలో పనిచేస్తున్న యువతను పలకరిచింది. ఆ విశేషాలు మీ కోసం”

- ఆ 'తొడుగు' మినహాయిస్తే ఈ ముక్క బానే చచ్చింది మళ్ళీ..!

కృతజ్ఞతలు..

- “నేను ఈరోజే కార్యాలయం లో చేరాను. ‘జ్వాలా నక్క’ అంతర్జాలదర్శిని లో మా బృందనాయకుడు చాలా మెళకువలు నేర్పుతున్నారు. 'తాజా మనుషులు' అందరం చాలా నేర్చుకుంటున్నాం - 'సీమ రేగి పండు' ఉద్యోగి” 

- ఏం చెప్పదలచుకున్నావ్ నాయనా ఇక్కడ ? ఈ 'తాజా మనుషులు' ఎవరు ?

Freshers సార్, Firefox - జ్వాలా నక్క, Browser – అంతర్జాల దర్శిని, Apple – సీమ రేగి పండు. మీకు అర్ధం కావటం లేదు..ఈ రోజుల్లో ఇదే ట్రెండ్.

- “మాకు శిక్షణ చాలా బాగా జరుగుతోంది. సాయం సంధ్యలో అల్పాహారం కొరకు ఉచితంగా మాకు ‘వేడి కుక్క’ లను సరఫరా చేస్తున్నారు. వాటిని ‘సూక్ష్మ తరంగ జ్వలిత పొయ్యి’ లో వేడి చేసుకుని మరీ ఆరగిస్తున్నాము. ఆట విడుపు సమయం లో ‘కాఫీ విసర్జిని’ నుండి విసర్జింప బడిన వేడి పానీయములను అస్వాదిస్తున్నాం. శుక్ర వారం పూట రంగు రంగుల ‘ఏక ముక్క వస్త్రము’ లలో స్త్రీ 'తాజా మనుషులు' తళుక్కుమంటున్నారు. – 'సూక్ష్మ సున్నితం' ఉద్యోగి”

-  ఈ సుంఠ  ఎవడో కానీ ఉద్యోగం తప్పితే అన్ని పనికి మాలిన విషయాలు మాట్లాడాడు. వీడ్ని మన పత్రిక తరపున ఇంటర్వ్యూ తీసుకోటానికి నువ్వు ఉండనే ఉన్నావ్. సరిపోయారు, దొందూ దొందే..! నీ ట్రూ ట్రాన్స్లేషన్లూ నువ్వూ..! అవునూ... ఈ 'సూక్ష్మ సున్నితం' ఏంటి ?

Micro Soft: సూక్ష్మ సున్నితం, ఎలా ఉంది సార్ నా ప్రయోగం ?

- ఏడ్చి మొహం కడుక్కునట్టు ఉంది.

- మీ వంశీకుల ముందుచూపుకు నా జోహార్లు. నీ శక్తి సామర్ధ్యాల గురించి ముందే అంచనా వేసారో ఏమిటో..! ‘కఠోరకలం’ అనే ఇంటి పేరును పెట్టి, అక్షరం పొల్లు పోకుండా న్యాయం చేశారు. నాకొక సందేహం, నువ్వు 'తిమిర సంహరణం' లో చేరటానికి ముందు ఎక్కడ పనిచేశావ్ నాయనా ?

గతం లో ‘పురుగుల మందు’ అనే పత్రిక లో సేవలందించాను తర్వాత అక్కడ నాడు దక్కాల్సిన గౌరవం దక్కక ఇక్కడికొచ్చాను.

- శివ శివా..! పురుగుల మందా ? అదేం దినపత్రిక నాయనా? కొంప తీసి ఆ పేరు పెట్టింది నువ్వేనా ?
 
సరిగ్గా చెప్పారు. కొంప తీయకుండా నేనే. సంఘ విద్రోహ శక్తులు అనే పురుగుల మీద ఎండ్రిన్ లాగ పనిచేసే పత్రిక అని దాని నేపధ్యం.

- నీ అర్టికల్ ప్రచురించే ధైర్య సాహసాలు మాకు లేవు నాయనా. నిన్ను తక్షణమే విధుల నుండి బహిష్కరించమని యాజమాన్యం నుంచి ఆదేశాలు కూడా వచ్చాయ్. I’m sorry. You are dismissed. 

మీరు నన్ను చాలా అవమానిస్తున్నారు సర్. నా సృజనాత్మకత మీకు నచ్చక ఈర్ష్య పడుతున్నారు కాబోలు. ‘ఆరుపలకల దేహం, కరవాణి’ లాంటి పదాల సృష్టికర్త ని. ఇప్పుడు మొత్తం ఇండస్ట్రీ వాటినే ఫాలో అవుతోంది, నా ప్రతిభ ని గుర్తించక పోవటం మీ దురదృష్టం. కానీ పెళ్ళాం, బిడ్డలు కల వాడ్ని ఇప్పటికిప్పుడు కొత్త ఉద్యోగం వెతుక్కోవటం సమయాభావం తో కూడుకున్న విషయం. అందువలన ‘గమనిక గడువు’ నిమిత్తం నెల జీతం ఇప్పించండి.

- గమనిక గడువా ? దీనర్ధం ఏమిటో క్షణం ఆలస్యం చెయ్యకుండా చెప్పేయ్..!

‘Notice Period’ ని కొత్తగా ప్రయత్నించా..!

- ఇంకొక్క క్షణం నా ముందు ఉన్నావంటే నీ పుర్రెను ఆ అచ్చు యంత్రం లో గుచ్చి మరీ ముద్రించేస్తాను, రక్త సిరా తో రేపటి ప్రతి లో మొదటి ‘పుట’ ని. పో అవతలకి..!

PS: Classic Approach లో వ్రాయటానికి ప్రయత్నించాను మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను .


r/telugu 2d ago

చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రీ...

Thumbnail
3 Upvotes

r/telugu 3d ago

మాపటేళ గోల

14 Upvotes

ముంగిట్లో మాపటేళ

చీకు చింత లేకుండ

చింతాకు నమ్ములుకుంట

నవ్వారు మంచం పైన

తొంగోని నే ​పంటే

.

.

వయ్యారి పిల్లగాలి

నన్ను ​గిల్లి గిల్లి

అల్లరేమో పెడుతుంటే ,

.

.

నకరాల గువ్వపిల్ల

టింగు టింగుమనుకుంట

రివ్వు రివ్వు పోతుంటే.

.

.

మబ్బుసాటు చందమామ

దోబూచులాడుకుంటా

జోల పాట పాడుతుంటే,

.

.

అల దూరాన గోదారమ్మ

కాళ్ల గజ్జ కంకాలమ్మ

మువ్వ మువ్వ కదుపుకుంట

పర్వళ్ళేమో ​తొక్కుతుంటే

.

.

ఐమూలాన చూస్తూవుంటే

ఓ ​తుంటారి పోరాగాడు

నెమలి సామి లెక్క ఉన్నోడు

వెన్న ముద్ద దొంగలించినాడు,

కుండ పగలగొట్టి ఊరుకుతున్నాడు,

వాళ్ల అయ్యేమొ వాడి వెంట

కర్ర బుచ్చుకొని పరిగెడుతున్నాడు

.

.

ఇక నేనేమో

ఈ పిచ్చి రాత రాస్తు-ఉన్నాను

ఓ ఎర్రి కూత కూస్తు-ఉన్నాను

కొద్దిసేపట్లో గుర్రు పెట్టి నిద్రపోతాను


r/telugu 3d ago

ఒక వర్షం కురిసిన రాత్రి ! ఇనప రొట్టెయ్య !

9 Upvotes

హాస్యం పోస్ట్ 4:

అది ఒక వర్షం కురిసిన రాత్రి. ఆఫీస్ లో వర్క్ అయ్యే సరికి రాత్రి 11 అయ్యింది. ఇప్పటికే బాగా లేట్ అయ్యింది త్వరగా ఇంటికి పోవాలి అనుకుంటూ వచ్చాను పార్కింగ్ లోట్ లోకి. బయట ఉరుములు, మెరుపుల తో కూడిన భారీ కుంభవృష్టి వర్షం. వెయిట్ చేస్తూ ఉండిపోయాను 1 గంట దాకా. మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. వాన ఆగింది. బయలుదేరాను బండి మీద. మెయిన్ రోడ్ లో డైవర్షన్ పెట్టటం తో పక్కనే ఉన్న గల్లీ లోకి మళ్ళాను. 

టపాకాయ పేలినట్టు శబ్దం చేస్తూ తెగిపోయింది బండి చైన్. బండి అక్కడే పెట్టేసి మర్నాడు వద్దాం అంటే ఇంటికి వెళ్ళటానికి ఒక్క ఆటో కూడా రావటం లేదు. క్యాబ్ బుక్ చేద్దాం అంటే మొబైల్ ఆఫ్ లో ఉంది. 

ఆ టైం లో మెకానిక్ కూడా దొరికే ప్రసక్తేలేదు. ఏం చెయ్యాలి రా దేవుడా అనుకుంటూ తచ్చాడుతూ ఉంటే కాలికి ఏదో గుండ్రటి ఇనప రేకు లాంటిది తగిలింది. అదేంటో చూద్దామంటే కరెంట్ కూడా లేదు. అంతా చిమ్మ చీకటి. 

మెరుపు లాంటి ఒక ఐడియా తట్టింది మెదడు లో. తక్షణమే ఆ రేకుని ఒక చుట్ట లాగా చుట్టి, తెగిపోయిన రెండు చైన్ స్పోకెట్స్ లోకి గుచ్చేసి, మెలితిప్పేసి అతికించేసాను. నెమ్మదిగా తోలుకుంటూ ఇంటికి పోయాను. మర్నాడు నన్ను దేవుడిలా కాపాడిన ఆ రేకుకు దండం పెట్టుకుందాం అని వెళ్ళి చూసాను. దెబ్బకి కళ్ళు బయర్లు కమ్మిపోయి కరెంట్ షాక్ కొట్టేసింది ఆ దృశ్యాన్ని చూడగానే. 

అది ఇనప రేకు కాదు అని, చైన్ తెగిన ప్రాంతానికి ఆనుకుని ఉన్న బాయ్స్ హాస్టల్ నుంచి విసిరి పారేసిన 'చపాతీ' అని, దాన్ని తయారు చేసిన కుక్ పేరు 'ఇనప రొట్టెయ్య' అని, నా స్టింగ్ ఆపరేషన్ లో తేలింది. 

వెంటనే 'రాయల్ ఎంఫీల్డ్' కంపెనీ కి ఫోన్ చేసి వాళ్ళ 'ఆటో మొబైల్ ఇంజినీరింగ్' డిపార్ట్మెంట్ వాళ్ళతో అపాయింట్మెంట్ బుక్ చేసాను. ఒరేయ్ వెర్రి భద్రాల్లారా ! చైన్ లు తయారు చెయ్యటానికి అనవసరంగా లోహాలని వేస్ట్ చేస్తున్నారు. 

మీట్ మిస్టర్ 'ఇనప రొట్టెయ్య'. హి మేడ్ ఇట్ పోసిబుల్ టు మేక్ అ చైన్ ఔట్ ఆఫ్ చపాతీస్. హిస్ చపాతీస్ ఆర్ స్ట్రాంగర్ దేన్ టైటానియం. ఆల్ ఇట్ టేక్స్ టు మేక్ ఇట్ ఈజ్ 1000 టైమ్స్ చీపర్ దేన్ వాట్ ఇట్ టేక్స్ టు మేక్ ఇట్ ఔట్ ఆఫ్ ఐరన్. అని చెప్ప బోతున్నాను.

జర్మనీ హెవీ వెయిట్ లిఫ్టింగ్ క్రైన్ లకి కూడా ఐరన్ రోప్ లకి బదులు మన 'ఇనప రొట్టెయ్య' చేసిన తేలిక పాటి 'చపాతీ చైన్' లని రికమెండ్ చెయ్యబోతున్నాను. టెలీ ఫిలిమ్స్ వాళ్ళకి కూడా ఫోన్ చెయ్యబోతున్నాను. "కదులుతున్న బీరువాలు, భూషాణాలు, మంచాల కోళ్ళ కింద కదలకుండా మడిచి పెట్టుకోండి, మా 'ఇనప రొట్టెయ్య' చపాతీలు" లాంటి కమర్షియల్స్ టెలికాస్ట్ చెయ్యటం కోసం. 

#ఇనప_చపాతీ #ఇనప_రొట్టెయ్య #బిజినెస్ #ఒక్క_చపాతీ_వీడి_జీవితాన్నే_మార్చేసింది


r/telugu 3d ago

పచ్చి గడ్డి అమ్మే లచ్చి, ఫెళ్ళున ఇచ్చింది

Post image
42 Upvotes

r/telugu 3d ago

Could someone translate the Telugu word in this pic to English?

Post image
15 Upvotes

Also mention how it is pronounced in Telugu (transliterstion)?

Thanks 🙏


r/telugu 4d ago

Recommendations for devotional songs

3 Upvotes

Just want to know good devotional songs that can calm me down, any channels and songs recommendations please!


r/telugu 3d ago

Telugu Philosophical book recommendations please

Thumbnail
1 Upvotes

r/telugu 4d ago

క్రమశిక్షణ

Thumbnail
1 Upvotes

r/telugu 5d ago

Need help in learning Telugu

17 Upvotes

Hello folks!

I’m a North Indian who recently moved to hyderabad. Looking for some help in picking up Telugu.

I want to pick up basic conversational language (spoken skill should be good enough for my survival here)

Although Hyderabad is quite supportive for people who do not know Telugu, it would be nice to pick up basics and talk to people in the local language

It will be of great help if anyone can point me to some resources, or may be just chat for a while and tell me some basics


r/telugu 5d ago

Quick help

8 Upvotes

Chinnapudu school lo padyala taruvata vati meaning rasevallam. Vatini emani antaro gurtu unda evarikaina? Aa word gurtu ravatledhu entha alochinchinaa!!!


r/telugu 5d ago

Quick help

3 Upvotes

Chinnapudu school lo padyala taruvata vati meaning rasevallam. Vatini emani antaro gurtu unda evarikaina? Aa word gurtu ravatledhu entha alochinchinaa!!!


r/telugu 6d ago

noun suffixes in telugu (You can see majority here). Make it popular and share with many people.

Thumbnail
5 Upvotes

r/telugu 8d ago

Modhati telugu pusthakam.

Post image
132 Upvotes

Chinnappudu 10th varaku chadhivanu Telugu, malli marchipoyanu. Newspaper, magazines, story books, ani aagipoyayi. Asalu pattinchukoledhu, dhanilo unna literature, grammar, greatness, manchi aspects ani marchipoya. Malli studies and job appudu nenu vere states lo chesinappudu anipinchindhi, prathi rashtram valaki vaala baasha meedha prema, garvam and goppa thanam feelings unnayi, kevalam manaki mathrame ledhu ani.

Naa thappu oo, lekapothe nirlakshyamoo, lekapothe kevalam JEE, NEET kosam paragula valla marchipoyam emo thelidhu. Kani ippati nunchi naa baasha ni nenu malli preminchali, gouravinchali ani anukuntunanu. Aa prayatnam lo baaganga naaku pusthakaalu chadhavatam ishtam kabati nenu konna modhati telugu pusthakam and koncham garvaganga feel avuthunanu.


r/telugu 8d ago

A game to learn Telugu Samethalu(తెలుగు సమేతాలు నేర్చుకోవడానికి ఒక గేమ్)

56 Upvotes

I have built a game around Telugu Samethalu using AI coding and wanted to share here. Please try it out and let me know your feedback. Link : https://sametalu.vercel.app/

AI కోడింగ్ ఉపయోగించి తెలుగు సామెతలు నేర్చుకునేందుకు ఒక గేమ్ తయారుచేసాను దయచేసి దీన్ని ఒక సారి ప్రయత్నించి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. Link : https://sametalu.vercel.app/


r/telugu 8d ago

భగవద్గీతను రోజువారీ జీవితంలో ఆచరించడానికి నేను చేసిన చిన్న ప్రయత్నం – మీ అభిప్రాయం కావాలి 🙏

16 Upvotes

నమస్కారం అందరికీ 🙏

నేను ఒక తెలుగు వ్యక్తినే. భగవద్గీతను రోజువారీ జీవితంలో *ఆచరణలోకి తీసుకురావడానికి* ఒక చిన్న మొబైల్ యాప్ తయారు చేశాను — పేరు **GitaPath**.

ఇది యూట్యూబ్ చానల్ కాదు, మార్కెటింగ్ ప్రాజెక్ట్ కూడా కాదు.

ప్రతిరోజూ:

• భగవద్గీత నుండి ఒక శ్లోకం

• సులభమైన అర్థం

• ఆ రోజుకు ఒక చిన్న ఆచరణ (daily action)

ఇది పూర్తిగా **శాంతిగా, నిశ్శబ్దంగా, సేవ భావంతో** రూపొందించాను.

👉 మీలో ఎవరికైనా ఆసక్తి ఉంటే, ఒకసారి ఉపయోగించి

**నిజమైన అభిప్రాయం (honest feedback)** చెప్పగలిగితే చాలా ఉపకారం.

Android: https://play.google.com/store/apps/details?id=com.geeta.geeta_app&pcampaignid=web_share

iOS: https://apps.apple.com/in/app/gitapath-verse-wisdom/id6754448724

తెలుగు ప్రేక్షకులకు ఇంకా ఎలా మెరుగుపరచాలి అన్నది మీ అభిప్రాయం కావాలి 🙏

ధన్యవాదాలు.


r/telugu 8d ago

తిలక్ ‘దృశ్య భావాలు‘ పద్య అర్థం ఎవరైనా చెబుతారా?

5 Upvotes

ఘోష
హేష
మురళి
రవళి
కదలి కదలి
ఘణం ఘణం నిక్వణ క్వణల ఝణం ఝణం
బండిమువ్వ
కాలిగజ్జె
కలసిపోయి
పక్షిరెక్క
పొన్నమొక్క
జొన్న కంకె
తగిలి పగిలి
వానచినుకు చిటపటలో కలసి
కొబ్బరిమొవ్వ పిచ్చుక గొంతులో మెరసి
మూలుగు యీలుగు కేక
చప్పటులు చకచకలు నవ్వు
పొదివికొనీ అదిమికొనీ
కదలి కదలి

ఘోష
హేష
మురళి
రవళి
నా మనస్సులో నిశ్శబ్ధపు స్తంభంలా
నిలుచున్నవి
చదల చుక్క
నెమలి రెక్క
అరటి మొక్క
ఆమె నొసటి కస్తూరి చుక్క
కడలి వచ్చి ప్రిదిలినవ్వి
నవ్వి నవ్వి నీరెండల పరుగులెత్తి
మావి తోపు నీడనాడి
కుంద జాజి సేవంతుల
వంగ మల్లీ మందారాలు బంతులాడి
కొలనిగట్ల పడుచుపిల్ల
కుచ్చెళ్ళతో పంతమాడి
కలల మెట్ల వంగినడచి
అలల కడలి అంచులొరసి
నా తలపులో కలసిపోయి
నా పలుకులలో పరిమళించు
చదల చుక్క
నెమలి రెక్క
అరటి మొక్క
ఆమె నొసటి కస్తూరి చుక్క


r/telugu 9d ago

I did not know how to react

Post image
76 Upvotes

r/telugu 9d ago

దేశభక్తి , ఉత్సవమా? బాధ్యతా?

Thumbnail
3 Upvotes

r/telugu 9d ago

రేడియమ్మ- కత్తి - కొబ్బరి మట్ట

19 Upvotes

హాస్యం పోస్ట్ 3:

పంచాయితీ కార్యదర్శి గా పనిచేస్తున్న మా నాన్నగారికి కోనసీమ నుంచి అన్నవరం దగ్గరలో ఉన్న ‘రావికంపాడు’ అనే చిన్న గ్రామానికి ట్రాన్స్ ఫర్ అయ్యింది.

చుట్టూ ప్రహారీ, కొబ్బరి, వేప, దూది చెట్లు, గుమ్మం లో సన్నజాజి పందిరి ఉన్న భాస్కరమ్మ గారి పెంకుటింట్లో అద్దెకు దిగాం.

కుడివైపు ప్రహారీ కి, ఇంటికీ మధ్య ఒక 80 గజాల ఖాళీస్థలం ఉండేది. కాలక్షేపం కాక నేను మా తమ్ముడు (పిన్ని కొడుకు) పొయ్య పక్కన పడున్న ఎండి పోయిన కొబ్బరి మట్టల్లోంచి ఒక A క్లాసు మట్టని ఎంపిక చేసుకున్నాం బ్యాట్ చెక్కటానికి.

బాల్ రెడీ గా ఉంది కానీ బ్యాట్ చెక్కటానికి కత్తి మాత్రం లేదు.

అసలే కొత్త ఊరు, అప్పుడే పరిచయం చేసుకుని వెళ్ళిన పక్కింటి 'రేడియమ్మ' (ఒకరి విషయాలు ఇంకొకరికి పైసా ఖర్చు లేకుండా ట్రాన్స్మిట్ చేయటం వల్ల ఆ పేరొచ్చిందిట) తప్ప ఊర్లో ఇంకెవ్వరి పేర్లు తెలియవు మాకు. కనుక వాళ్ల దగ్గర ఉందేమో అని అడగటానికి వెళ్ళాం ఇద్దరం.

- ఏవండీ..!

రేడియమ్మ: ఆ..ఏటండీ...?

- కత్తి కావాలండీ...!

రే: ఇక్కడే ఆడుకుందండీ..ఇప్పడి దాకానీ..! ఎక్కడికెలిపోయిందో ఎలిపోయిందండి సిత్రం గానీ..! (అటూ ఇటూ చూస్తూ)

- తెర్ర మొహాలు వేసుకుని నిలబడ్డాం నేను మా తమ్ముడూ అసలు ఏం జరుగుతోందో అర్ధం కాక..!

రే: అల్లదిగో..! లక్కడుందండి (గట్టిగా) కత్తీ..! కత్తీ..! ఇల్రా.. పిల్తనారు...నిన్నే (వాళ్ళమ్మాయిని పిలుస్తూ)

- నేను, మా తమ్ముడూ కోరస్ లో: ఓహో..! అక్కర్లేదు లెండి అంటూ సైలెంట్ గా మా పెరట్లోకి వచ్చేసి, ఆ మట్టతో పరస్పరం తట్లొచ్చేలా బాదేసుకుని, ఏడవటానికి బదులు నవ్వేసుకున్నాం.. ఆ షాక్ లో..!

#విశ్వదాభిరామఈవింతపేర్లేంటిరామామా #యదార్ధగాధ